Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంత వరకైనా పోరాడదాం: జగన్

YS Jagan Mohan Reddy vows to fight to any extent for justice
Advertisement
  • వైసీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ
  • స్థానిక ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చర్చ
  • చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతోందని ఆరోపణ
Advertisement
వైసీపీ అధినేత జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింస, అక్రమాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతోందని ఆరోపించిన జగన్, ప్రజాస్వామ్య పరిరక్షణకు న్యాయపోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

"చంద్రబాబు వ్యవస్థీకృతంగా, ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నవారే హింసకు పాల్పడటం ఎక్కడా చూసి ఉండం. పోలీసులను వాడుకుని ఈ దారుణాలన్నీ చంద్రబాబు చేయిస్తున్నారు" అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ధైర్యం ప్రదర్శిస్తున్నారని జగన్ ప్రశంసించారు. "క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘటనలపై ఆధారాల సేకరణ చాలా అవసరం. పటిష్ఠ ఆధారాలను కోర్టుల ముందు ఉంచడం ద్వారా న్యాయపోరాటం చేద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎందాకైనా పోరాటం చేద్దాం" అని జగన్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
Advertisement
Advertisement
YS Jagan Mohan Reddy
YSRCP
Chandrababu Naidu
Andhra Pradesh local body elections
Supreme Court
Election violence

More Telugu News